పసిడి ప్రియులకు గుడ్న్యూస్. ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 తగ్గటంతో రూ.79,470గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 తగ్గి రూ.72,850 ఉంది. కాగా, కిలో వెండిపై భారీగా రూ.2000 తగ్గటంతో రూ.1,10,000గా ఉంది.