J&K పుల్వామాలో ఉగ్రవాదులు స్థానికులపై కాల్పులకు తెగబడ్డారు. ఇవాళ ఉదయం జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో ఓ కార్మికుడు గాయపడ్డాడు. బటాగుండ్ గ్రామంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బిజ్నోర్కు చెందిన శుభమ్ కుమార్ చేతికి తుపాకీ గాయమైందని అధికారులు తెలిపారు. ఆదివారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు కార్మికులు, ఓ వైద్యుడు మృతిచెందాడు. కాగా, వారం రోజుల్లో ఉగ్రవాదులు మూడుసార్లు కాల్పులకు పాల్పడ్డారు.