TG: మూసీ పునరుజ్జీవం పేరుతో పేదల ఇళ్లు కూలుస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ‘పేదల ఇళ్ల కూల్చివేతను వ్యతిరేకిస్తున్నాం. మూసీ పేరుతో కాంగ్రెస్ భారీ అవినీతికి తెర లేపింది. కాళేశ్వరం పేరుతో BRS లక్ష కోట్ల రూపాయలు వాడుకుంది. మూసీ పేరుతో రూ.1.50 లక్షల కోట్లు అప్పు చేసి కాంగ్రెస్కు ATM లాగా మార్చాలనుకుంటున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వటం గగనమైంది’ అని పేర్కొన్నారు.