స్టార్ హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో హర్రర్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా ‘రాజాసాబ్’. ఈ మూవీ కన్నడ హక్కులను ప్రముఖ సంస్థ హోంబలే ఫిల్మ్స్ వారు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిన్న ప్రభాస్ బర్త్ డేను పురస్కరించుకుని ‘రాజాసాబ్’ పోస్టర్‌పై వారి లోగోను వేసుకుని షేర్ చేశారు. దీంతో కన్నడలో హోంబలే నిర్మాణ సంస్థ ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు అర్థమవుతుంది.