AP: కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ్టి నుంచి ఈనెల 28వ తేదీ వరకు విజయవాడలోనే ఉండి పార్టీ బలోపేతంపై జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ, మండలస్థాయి నేతలతో సమీక్షలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం శ్రీకాకుళం జిల్లా నేతలతో సమీక్షించనున్నారు. రాష్ట్రంలో 2029 నాటికి పార్టీని బలోపేతం చేసి పూర్వవైభవం తెచ్చేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.