GNTR: గుంటూరు పట్టణంలోని పల్నాడు బస్టాండు సెంటర్లోని కూరగాయల మార్కెట్లో బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లాలాపేట పోలీసులు గుర్తించారు. మృతుని వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని, తెల్ల రంగు టీషర్ట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.