ELR: ఏలూరు రామకోటి దేవాలయంలో చోరీకి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. నగరంలోని గజ్జల వారి చెరువు సమీపంలో బుధవారం ఉదయం ఇద్దరూ అనుమానాస్పదంగా జరుగుతున్న వ్యక్తులను పోలీసు తనిఖీలలో గుర్తించామన్నారు. వారి వద్ద నుండి రూ.1,25,000 విలువ చేసే ఆభరణాలను రికవరీ చేసి దేవాలయానికి అందజేశారు.