TG: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దారుణ చోటుచేసుకుంది. బాలికపై ఓ సీఐ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కాజీపేట పోలీసులు సీఐపై లైంగిక వేధింపులు, పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.