BDK: బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన కైపు ఎలమంద రెడ్డి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.