HYD: సుభాశ్నగర్ డివిజన్ పరిధిలోని లిటిల్ స్టార్ స్కూల్ గ్రౌండ్లో ఒడిశా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గజలక్ష్మి పూజ కార్య క్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి కృపాకటాక్షాలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.