సాయిపల్లవి తన డ్రెస్సింగ్ స్టైల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమాల్లోకి రాకముందు ఓ డ్యాన్స్ పోటీలో ఫ్యాన్సీ డ్రెస్ వేసుకున్నానని చెప్పింది. అయితే తన తొలి సినిమా ‘ప్రేమమ్’ రిలీజ్ అయ్యాక ఆ డ్యాన్స్ వీడియోను నెటిజన్లు వైరల్ చేస్తూ.. డ్రెస్సింగ్ గురించి కామెంట్స్ చేయడం తనను బాధించిందని తెలిపింది. స్క్రీన్‌పై కనిపించినప్పుడు అలాంటి దుస్తులు వేసుకోకూడదని అప్పుడే ఫిక్స్ అయ్యానని పేర్కొంది.