HNK: ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ను బుధవారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబ కిషోర్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. నేర ఆరోపణలపై స్టేషన్కు వచ్చే వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలన్నారు. పెండింగ్ కేసులు, ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.