ప్రకాశం: పంగులూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని బుధవారం ఎంపీపీ తేళ్ల నాగమ్మ అధ్యక్షతన ఎంపీడీవో స్వరూప రాణి నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామాలలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధిపై సర్పంచులు, ఎంపీటీసీలు తమ సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ప్రగతి నివేదికను చదివి వినిపించారు.