AP: మాజీ సీఎం జగన్ గుంటూరు పర్యటనపై మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అధికారంలోకి వచ్చాక మీ బాబాయి హత్య గురించి నోరు విప్పలేదు. నేరపూరిత ఆలోచనలతో జగన్ ఐదేళ్లపాటు పరిపాలన చేశారు. దళితులు, మైనార్టీలు, బీసీలు హత్యకు గురైనప్పుడు ఎప్పుడైనా పరామర్శించారా..? కానీ, జగన్ మాత్రం నిందితుడు టీడీపీ వ్యక్తి అని అసత్య ప్రచారం చేశారు. అరాచకాలు, మహిళలపై దాడులకు పాల్పడిన వారిని క్షమించము’ అని మండిపడ్డారు.