TG: మాజీమంత్రి కేటీఆర్ నోటీసులపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక నోటీసులా అని ప్రశ్నించారు. విమర్శలకు నోటీసులే సమాధానమా అంటూ మండిపడ్డారు. తాను కూడా నోటీసులు పంపిస్తానని.. కాచుకోమని సవాల్ చేశారు. తనని అవమానిస్తేనే బదులిచ్చానని చెప్పారు. మాటకు మాట.. నోటీసుకు నోటీసులతోనే జవాబిస్తానని స్పష్టం చేశారు.