MBNR: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ మొదటి, మూడవ, అయిదవ సెమిస్టర్ పరీక్ష ఫీజు గడువును ఈనెల 28 వరకు పొడిగించినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. కావున ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈనెల 28 వరకు ఆయా సంబంధిత కళాశాలల్లో ఫీజు చెల్లించాలని సూచించారు.