TG: నల్గొండ జిల్లాలో గల 12వ పోలీసు బెటాలియన్లో పనిచేస్తున్న 20 మంది కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. తమ భర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారి భార్యలు సోమవారం పెద్ద ఎత్తున బెటాలియన్ ముందు ధర్నా చేశారు. దీంతో బెటాలియన్ ఉన్నతాధికారులు ధర్నాలో పాల్గొన్న వారిని గుర్తించి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. తమ భార్యలు ధర్నా చేస్తే తమను సస్పెండ్ చేయడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.