BDK: కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈనెల 28న కబడ్డీ పోటీలు నిర్వహించనున్న ఈ నేపథ్యంలో బుధవారం భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కబడ్డీ పోటీల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కబడ్డీ పోటీలు ఈనెల 28, 29, 30 తేదీల్లో జరుగుతాయని వెల్లడించారు. వారితోపాటు కాంగ్రెస్ నాయకుడు పాల్గొన్నారు.