TG: కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ విధానాలకు ఫిరాయింపులు వ్యతిరేకమని.. BRS నుంచి కాంగ్రెస్లోకి చేరిన వారిపై వేటు వేయాలన్నారు. పార్టీ ఫిరాయిస్తే సస్పెండ్ చేయాలనే చట్టం ఉందని తెలిపారు. కాంగ్రెస్కు సంపూర్ణ మెజారిటీ ఉందని.. MIMను మినహాయించిన పార్టీ సుస్థిరంగా ఉంటుందన్నారు. 4 నెలలుగా అవమానాలకు గురవుతున్నానని.. తాను కాంగ్రెస్ నేత అని చెప్పుకునే స్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.