కేజీఎఫ్-3 చేసే ఆలోచన ఉన్నట్లు హీరో యశ్ తెలిపారు. దీనిపై ఇప్పటికే ఒక ఐడియాను డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో చర్చించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నటిస్తున్న ‘టాక్సిక్’ మూవీ ముందుగా ప్రకటించినట్లుగా ఏప్రిల్ 10న, 2025 విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ‘రామాయణ’ ప్రాజెక్టులో రావణుడిగా నటిస్తున్నట్లు చెప్పారు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక కేజీఎఫ్-3 చేస్తామని అన్నారు.