NLG: దేవరకొండ విద్యుత్ శాఖ నూతన ఏఈగా రాజేష్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఇక్కడ విధులు నిర్వహించిన ఏఈ జమీరుద్దీన్ హైదరాబాద్ కు బదిలీపై వెళ్లగా, ఆయన స్థానంలో మర్రిగూడ మండలం నుంచి రాజేష్ ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ను మర్యాద పూర్వకంగా కలిశారు. వీరితో పాటు విద్యుత్ కాంట్రాక్టర్ సంతోష్ ఉన్నారు.