AP: తిరుపతి జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. చిల్లకూరు మండలం నాంచారంపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజకీయ కక్షతో మల్లారపు హరిప్రసాద్ అనే వ్యక్తిని అతని ప్రత్యర్థులు దారుణంగా చంపారు. ఇంట్లో నిద్రిస్తుండగా పెట్రోల్ పోసి నిప్పు అంటించడంతో హరిప్రసాద్ ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.