WGL: వెంకటపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల్లో మంత్రి సీతక్క మంగళవారం రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఈ సంవత్సరం డిసెంబర్ 9లోగా రూ.2 లక్షల లోపు ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. అలాగే, పొలం బాట కార్యక్రమంలో పొలాలకు రోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.