TG: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. మాల్‌కు ష్యూరిటీగా ఉన్న రైతులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ రైతుల వ్యవసాయ భూముల వద్ద నోటీసులు అంటించారు. రూ.45 కోట్ల వడ్డీ సహా అసలు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బకాయిలు చెల్లించకపోతే భూములు స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.