AP: రాజకీయ నాయకుల ప్రవర్తన బాధ కలిగిస్తోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఓ పాఠశాల వార్షిక వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశంలో విద్యాసంస్థలపై వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. నేతలు ఏ పార్టీలో ఉన్నారో రోజూ చూసుకోవాల్సి వస్తుందని అన్నారు. రాజకీయ నాయకుల ప్రసంగాల తీరు సరిగా లేదని పేర్కొన్నారు.