తమిళనాడు సీఎం స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొత్తగా పెళ్లి చేసుకునే జంటలు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని కోరారు. సీఎం సమక్షంలో నేడు 31 హిందూ జంటలకు సామూహిక వివాహం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 16 రకాల సంపదలకు బదులుగా 16 మంది పిల్లల్ని కనాల్సిన సమయం వచ్చిందన్నారు.