NTR: తిరువూరు మండలంలోని మల్లెల గ్రామం వద్ద సోమవారం రాత్రి బైక్ను లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిని తెల్లదేవరపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. తిరువూరు నుంచి తన స్వగ్రామం తెల్లదేవరపల్లి గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.