NLR: వాకాడు, ముట్టెంబాక, దుగరాజపట్నం గ్రామాల్లో మంగళవారం జరగనున్న పల్లె పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో అన్నపూర్ణ రావు అధికారులను కోరారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు తెలిపారు.