రాజ్యాంగ పీఠికలో లౌకికవాదం, సామ్యవాదం పదాలను చేర్చడాన్ని సవాల్ చేస్తూ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారించింది. భారత రాజ్యాంగంలో సెక్యులరిజం అనేది అందులో భాగమే అని వెల్లడించింది. మళ్లీ నవంబర్లో ఈ కేసు విచారించనున్నట్లు సుప్రీం తెలిపింది.