GNTR: కృష్ణ-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నిక చేసినందుకు సీఎం చంద్రబాబుకు మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉండవల్లిలో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు, MLC పరుచూరి అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు.