పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్, ఆయన అనుచరులు నిరాహార దీక్షను విరమించారు. లద్ధాఖ్కు రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్లో చేర్చాలన్న డిమాండ్లపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు ఆయన్ను కలిసి తమ ప్రతిపాదనలు ఉంచారు. అనంతరం ఆయనకు నిమ్మరసం అందజేసి దీక్షను విరమింపజేశారు. డిసెంబర్ 3న లేహ్ ఎపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ అలయెన్స్ ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు కేంద్ర హోంశాఖ అంగీకరించడంపై వాంగ్ చుక్ హర్షం వ్యక్తం చేశారు.