PDPL: రైతులకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పెండ్రు హనుమాన్ రెడ్డి, కిరణ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. మాజీ MLA చందర్ ఉనికి చాటుకోవడానికి రైతుల పేరిట నిరసనలు చేస్తున్నారన్నారు. నిరుద్యోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు.