TG: సిరిసిల్లలో కీచక టీచర్ బాగోతం బయట పడింది. గీతా నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో తెలుగు టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న నరేందర్ బాలికల ప్రైవేట్ పార్టులు తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో బాలికలు వేదనకు గురయ్యారు. విషయం పాఠశాల HMకి చెప్పినా పట్టించుకోవట్లేదని విద్యార్థినిలు ఆరోపిస్తున్నారు. చివరకు విషయం బయటకు పొక్కడంతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.