AP: ఉచిత ఇసుకపై అధికారులకు CM చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఉచితంగా ఇసుక అందించడమే లక్ష్యంగా సీనరేజీ రద్దు చేశామన్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో ఇసుక తీసుకెళ్లేవారు గ్రామ, వార్డు సచివాలయాల్లో నమోదు చేయించాలన్నారు. ఇసుక అందుబాటులో లేని జిల్లాల్లో స్టాక్ యార్డుల ద్వారా సరఫరా చేయాలన్నారు. ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలింపు కట్టడి కోసం చెక్ పోస్టులు పెట్టాలన్నారు. ఉచిత ఇసుక పాలసీని దుర్వినియోగం చేస్తే తీవ్ర చర్యలు తప్పవన్నారు.