AP: కేంద్ర మంత్రి అమిత్ షాతో మంత్రి సత్యకుమార్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పాలన, మంత్రిగా చేపట్టిన కార్యక్రమాల వివరాలు అమిత్ షాకు అందజేశారు. రాష్ట్రాన్ని జగన్ రూ. 11 లక్షల కోట్ల అప్పుల్లో ముంచి పోయారని, ఏడాదికి సుమారు రూ.75 వేల కోట్ల వడ్డీలు కట్టాల్సి వస్తున్నట్లు హోంమంత్రికి చెప్పారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను పక్కదారి పట్టించి దుర్వినియోగం చేశారని వివరించారు.