BPT: జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్ట్స్ పిల్లలకు ప్రభుత్వం కేటాయించిన 50శాతం రాయితీకి సంభందించిన జీవోను విడుదల చేయాలని ప్రెస్ క్లబ్ యూనియన్ కార్యదర్శి బత్తుల యజ్ఞ సురేష్ కోరారు. ఈ మేరకు బాపట్ల కలెక్టరేట్లో సోమవారం సంయుక్త కలెక్టర్ ప్రఖర్కు వినతిపత్రం అందజేశారు. సురేష్ మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు.