WGL: వరంగల్ జిల్లా వైద్య అధికారిపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఇటీవల స్టాఫ్ నర్స్ ఉద్యోగ నియామకాలలో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా నియామకాలు చేపట్టరన్నారు. ఈ విషయంపై కలెక్టర్ స్పందించి విచారణ చేపట్టి నిరుద్యోగులకు న్యాయం చేయవలసిందిగా కోరారు.