AP: కూడేరు మండలం పెన్నా అహోబిలంలో మంత్రి పయ్యావుల పర్యటించారు. శ్రీరామ్‌రెడ్డి తాగునీటి పథకాన్ని పయ్యావుల పరిశీలించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా గ్రామాలకు నీటి సరఫరా తీరును గమనించారు. తాగునీటి పథకం నిర్వహణ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీంతో నీరు పంపింగ్, శుద్ధి ఏవిధంగా జరుగుతుందో అధికారులు మంత్రికి వివరించారు.