AP: ఎర్రమట్టి దిబ్బలకు యునెస్కో గుర్తింపు సాధించాలని సీఎం చంద్రబాబుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ లేఖ రాశారు. ఎర్రమట్టి దిబ్బలు విశాఖపట్నం ప్రాంత వారసత్వ సంపద అని లేఖలో పేర్కొన్నారు. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అన్నారు. ఎర్రమట్టి దిబ్బలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపునకు ప్రయత్నించాలని కోరారు.