CTR: యాదమరి మండలం తాళ్లమడుగు అటవీ ప్రాంతంలో నేడు ఓ చిరుత పులి మృతి కలకలం రేపింది. చిరుత మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పులి గోర్ల కోసం ఈ ఘటన జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.