కృష్ణ: వరద బాధితులకు సాయం చేసేందుకు విద్యార్ధులు సైతం ముందుకు రావడం అభినందనీయమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం సుకర్లాబాద్ గాంధీ విద్యాలయం విద్యార్థులు మంత్రి కొల్లు రవీంద్రకు రూ.25వేలు చెక్కును అందించారు. బాధితులకు అండగా నిలవడం కోసం చిన్న పిల్లలు కూడా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని మంత్రి అన్నారు.