NLR: గూడూరు, పొదలకూరు, వయ్యారంపల్లి మధ్య విద్యార్థులు RTC బస్సుల్లో ప్రమాదకరంగా ఫుట్ బోర్డులపై ప్రయాణిస్తున్నారు. ఈ గ్రామాల మధ్య కేవలం ఒక్కటే బస్సు నడవడంతో ఈ పరిస్థితి నెలకొందని వారు వెల్లడించారు. ఉదయం విద్యార్థులు, సామాన్య ప్రజలతో నిత్యం రద్దీ ఎక్కువగా ఉంటోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. RTC అధికారులు స్పందించి అదనపు సర్వీసులను నడపాలని స్థానికులు కోరుతున్నారు.