NRML: ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు రోడ్డుపైనే భోజనం చేశారు. ఆదివారం రాత్రి ఖానాపూర్ పట్టణంలోని కొమురం భీం చౌరస్తా వద్ద నిర్వహించిన కొమురం భీమ్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడే రోడ్డుపై పలువురు ప్రముఖులు, ప్రజలతో కలిసి ఆయన భోజనం చేశారు.