AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో పర్యటించనున్నారు. గుర్ల గ్రామంలో డయేరియా ప్రబలిన నేపథ్యంలో పవన్ ఆ గ్రామానికి వెళ్లి స్థానిక పరిస్థితులపై అధికారులతో సమీక్షిస్తారు. గ్రామంలోని పరిస్థితులను స్వయంగా పరిశీలించనున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఈ గ్రామంలోని పరిస్థితులపై ఆరా తీశారు.