భారత్ సాధించిన డిజిటల్ విప్లవం పట్ల నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ పాల్ మైకేల్ రోమెర్ ప్రశంసల వర్షం కురిపించారు. భారత డిజిటల్ విప్లవం అత్యంత స్ఫూర్తిదాయకమైన, ఆసక్తికరమైన విజయగాథల్లో ఒకటని అభివర్ణించారు. ప్రపంచ శక్తులకు సరికొత్త ప్రమాణాలను నిర్దేశించిందని వివరించారు. ఈ క్రమంలో ఆయన ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని అభినందించారు. మోదీ సర్కారు డిజిటల్ విప్లవాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగిందని కొనియాడారు.