కేంద్రం త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ నిర్ణయంతో రాబోయే రోజుల్లో బాటిల్ వాటర్, సైకిల్స్, నోట్‌బుక్స్ రేట్లు తగ్గే అవకాశం ఉంది. ఆయా వస్తులపై జీఎస్టీ రేటును తగ్గించాలని కేంద్ర ప్రభుత్వ మంత్రుల బృందం సిఫారసు చేసింది. అదే సమయంలో సౌంధర్య సాధనాలు, లగ్జరీ వాచ్‌లు, బూట్ల ధరలపై జీఎస్టీని పెంచాలని విజ్ఞప్తి చేసింది. జీఓఎం సమావేశానికి హాజరైన సభ్యులు జీఎస్టీ కౌన్సిల్‌కు ఈ సూచనలు చేశారు.