రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించారు. ముఖేశ్ అంబానీకి బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ ఘన స్వాగతం పలికారు. కాగా చమోలీ జిల్లాలో ఉన్న బద్రీనాథ్ ఆలయం, రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న కేదార్నాథ్ ఆలయంలో ప్రార్థనలు చేసి రూ.5 కోట్ల భారీ విరాళాన్ని బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీకి అందజేశారు.