TG: ఎలాంటి స్వలాభం ఆశించకుండా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న బ్రహ్మకుమారీల సేవలు ఎంతో విలువైనవని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నిత్యం అనేక పనులతో తీవ్ర ఒత్తిడులకు లోనయ్యే వారు కొద్ది సమయం బ్రహ్మకుమారీస్ కార్యక్రమాల్లో పాల్గొంటే ఎంతో ఉపశమనం పొందుతారని తెలిపారు. భగవంతుడికి, భక్తుడికి మధ్య అనుసంధానంగా బ్రహ్మకుమారీలు వ్యవహరిస్తున్నారని, వారి జన్మ ఎంతో ధన్యమవుతుందని అన్నారు.