అన్నమయ్య: గాలివీడు మండలం తూముకుంట గ్రామంలో పిడుగుపాటుకు 18 గొర్రెలు మృతి చెందినట్లు బాధిత పాడి రైతు రామప్ప నాయుడు తెలిపారు. మండల పరిధిలోని తూముకుంట గ్రామం నాయనవారిపల్లెకు చెందిన రైతు రామప్ప నాయుడు పలు జీవాలతో జీవనం సాగిస్తున్నారు. ఉన్నట్లుండి మెరుపులు ఉరుములతో కూడిన పిడుగులు పడటంతో 18 గొర్రెలు మృతి చెందినట్లు తెలిపారు.