మెడ నొప్పి కారణంగా తొలి టెస్ట్ మ్యాచ్‌కు దూరమైన శుభ్‌మన్ గిల్ రెండో మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.తాజాగా నెట్స్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా గిల్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. గిల్ స్థానంలో తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగిన సర్ఫరాజ్ సెంచరీతో రాణించాడు. దీంతో రెండో టెస్ట్‌లో గిల్ జట్టులోకి వస్తే టీమ్ మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.